రేవంత్ ఇక మనకొద్దు: చంద్రబాబుకు ఎల్ రమణ లేఖ

  • పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాడు
  • సాధ్యమైనంత నష్టం కలిగించాలన్నదే రేవంత్ ఉద్దేశం
  • వెంటనే సస్పెండ్ చేయండి
  • అధినేతకు ఎల్ రమణ లేఖ
  • రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం
తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకుని రోజుకో మాట మాట్లాడుతూ తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న రేవంత్ రెడ్డిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి లేఖను రాశారు. గత వారంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలను, టీడీపీ ఎల్పీ సమావేశంలో జరిగిన సంభాషణల గురించి నివేదిక ఇచ్చిన ఎల్ రమణ, రేవంత్ వంటి నేత ఇక వద్దని, ఆయనపై వెంటనే వేటు వేయాలని కోరినట్టు తెలుస్తోంది.

రేవంత్ పార్టీ మారడం ఖాయమని, ఈ లోగా సాధ్యమైనంత మేరకు టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని, కాబట్టి ముందే నిర్ణయం తీసుకుందామని కూడా రమణ సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం లండన్ లో ఉన్న చంద్రబాబు, నేటి రాత్రికి ఇండియాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన వచ్చిన తరువాత ఒకటి రెండు రోజుల్లో రేవంత్ పై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
Go Back to Shorts
l ramana
revant reddy
Telugudesam

More Telugu News